పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త క్రేజీ కాంబినేషన్‌కు లైన్ క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఉరి’, ‘ధురంధర్’ చిత్రాల ఫేమ్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్.. ప్రభాస్ కోసం ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి ‘ఫౌజీ’, సందీప్ వంగా ‘స్పిరిట్’, ‘కల్కి’ సీక్వెల్స్ వంటి భారీ ప్రాజెక్టులతో రాబోయే రెండేళ్ల వరకు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదిత్య ధర్ కాంబో ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైతే, ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందనే అంశంపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇండియన్ సినీ సరిల్క్స్‌లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘బాహుబలి’ సిరీస్ నుండి ఇటీవలి ‘కల్కి’ వరకు ఆయన బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అపూర్వం. ప్రభాస్ కటౌట్‌కు సరిపోయే కథ పడితే థియేటర్లలో రికార్డుల వేట ఎలా ఉంటుందో చాలా సినిమాలు నిరూపించాయి. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూసి అభిమానులు మురిసిపోతుండగా, తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ తెగ హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ‘ధురంధర్’ చిత్రాల ఫేమ్ ఆదిత్య ధర్ .. రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి మధ్య ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయని వినికిడి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *