కరోనా టైంలో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ అంటూ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యారు. కానీ ఆ తరువాత సూర్య నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేదు. ఎన్ని ప్రయోగాలు మార్చినా, జానర్స్ మార్చినా ఫలితం మాత్రం ఆశించినట్టుగా రాలేదు. ఇక ఇప్పుడు ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి చివరి నిమిషంలో ఆర్థిక కష్టాలు వచ్చాయి. అందుకే మే 14న రావాల్సిన ఈ సినిమా మే 15న వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఆడియెన్స్‌కి ఏ మేరకు నచ్చుతుంది? అన్నది చూద్దాం.

కథ
మునుస్వామి (ఇంద్రాన్స్) తన కూతురు మీను ఆపరేషన్ కోసం తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. వచ్చీ రాగానే అతని వద్ద 60 సవర్ల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్తారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే 45 సవర్లే వచ్చాయని చెబుతారు. వాటిని కోర్టులో తీసుకోవాలని చెబుతారు. దీంతో నాంపల్లి కోర్టులో ఉండే ఫేమస్ లాయస్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ)ని కలుస్తారు. అతనేమో డబ్బుల కోసం న్యాయాన్ని అమ్మేస్తుంటాడు. తన వద్దకు వచ్చిన వారిని జడ్జ్ రాజ నాయకన్ సాయంతో వాయిదాల మీద వాయిదాలు అంటూ కోర్టు చుట్టూ తిప్పి తిప్పి డబ్బులు వసూల్ చేస్తుంటాడు. అలాంటి వాడి చేతిలో చిక్కిన మునుస్వామి చివరకు విసిగి పోతాడు. అంతా దేవుడి మీదే భారం అని వీరభద్రుడు సాయం కోరతాడు. దీంతో వీరభద్రుడు (సూర్య) రంగంలోకి దిగుతాడు. అయితే బేబీ కృష్ణ మాత్రం ఇక్కడ ఇలానే ఉంటుంది.. ఇదే చట్టం, న్యాయం, ఇదే ప్రాసెస్ అని అంటాడు. నీకు చేతనైతే వచ్చి ఈ సిస్టమ్‌ను మార్చు అని దేవుడికే సవాల్ విసురుతాడు. సాధారణ మనిషిలా పోరాడాలి.. పవర్స్ వాడకూడదు అని కండీషన్ పెడతాడు. దీంతో లాయర్ సూర్యగా ఆ వీరభద్రుడు వస్తాడు. సాధారణ వ్యక్తిగా, లాయర్‌గా కేసుని వాదిస్తుంటాడు. అంతలోనే ఆపరేషన్ లేట్ అవ్వడంతో మునుస్వామి కూతురు చనిపోతుంది. వారికి న్యాయం చేయలేకపోయాను అని వీరభద్రుడు అనుకుంటాడు. దీంతో బేబీ కృష్ణ తను ఎంచుకున్న మార్గమే రైట్ అని వీరభద్రుడితో అంటాడు. ఆ తరువాత వీరభద్రుడు ఏ దారి ఎంచుకుంటాడు? కోర్టులో అబద్దాలు చెప్పి న్యాయాన్ని అమ్మేస్తున్న లాయర్లను ఏం చేస్తాడు? అందరికీ న్యాయం చేసేందుకు వీరభద్రుడు చేసిన మాయ ఏంటి? ఈ కథలో లాయర్ ప్రీతి (త్రిష) పాత్ర ఏంటి? చివరకు బేబీ కృష్ణ కథ ఎలా ముగుస్తుంది? అన్నది తెరపై చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *